సౌదీ అరేబియా రియాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మీనారాయణ

గత నెలరోజులుగా మృత్యువుతో పోరాడి సౌదీ అరేబియా రియాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మీనారాయణ అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన బి. లక్ష్మీనారాయణ గారు సుమారు ఆరు నెలల క్రితం డ్రైవర్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు వచ్చారు. గత నెల 22వ తేదీన ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఆయన స్పాన్సర్ రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీ (KFMC) ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆయన గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల సుమారు 90 శాతం వరకు బ్లాకేజీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఈ నెల 3వ తేదీన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స అనంతరం ఆయన కిడ్నీలు పనిచేయడం నిలిచిపోవడంతో...