జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ప్రాంగణంలో ఆగస్టు 15న నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయ సమాజానికి చెందిన సుమారు 600 మంది సభ్యులు, కాన్సులేట్ అధికారులు, సిబ్బంది, భారతదేశ మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలు జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. అనంతరం భారత కాన్సుల్ జనరల్ శ్రీ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ మాట్లాడుతూ.. భారతదేశం సాధించిన ప్రగతి,...