సౌదీ అరబియాలో భారత నూతన రాయబారికి సాటా మరియు టాసా హృదయపూర్వక శుభాకాంక్షలు
# సౌదీ అరేబియాలో భారత నూతన రాయబారిగా శ్రీ విపుల్ బాధ్యతల స్వీకరణ *రియాద్:* సౌదీ అరేబియాలో భారత నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త శ్రీ విపుల్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించింది. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన శ్రీ విపుల్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 2న సౌదీ అరేబియాలో తదుపరి భారత రాయబారిగా నియమించింది. భారత్–సౌదీ దౌత్య సంబంధాలు ప్రారంభమైన అనంతరం ఈ కీలక బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిమేతర భారతీయ రాయబారిగా శ్రీ విపుల్...