సౌదీ అరబియాలో అబూ మాథెన్ జార్జ్, డీసీఎం వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న సాటా రియాద్ ప్రతినిధులు
రియాద్: రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం శ్రీ అబూ మాథెన్ జార్జ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ & ఛార్జ్ డి అఫైర్స్ (ఎ. ఐ.)కి నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో సాటా రియాద్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గార్డెన్ రెస్టారెంట్ 2, అల్ ఉరైజా అల్ ఘర్బియాహ్, రియాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ కమ్యూనిటీల ప్రతినిధులు, సభ్యులు పాల్గొని శ్రీ అబూ మాథెన్ జార్జ్ తో తమ అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమ అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ, భవిష్యత్ నియామకాలు మరియు బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సాటా రియాద్ తరఫున ఆయన రియాద్‌లో విధులు నిర్వహించిన...