నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు
• ఐదుగురి అరెస్ట్.. ఒకరు పరారీ • కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ప్రభుత్వ రికార్డులను నకిలీగా సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న భారీ ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలతో పాటు ఆధార్, ఓటర్, పాన్ కార్డులు సృష్టించిన ఆరుగురిపై కేసు నమోదు చేయగా, అందులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ...