కువైట్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

రియాద్: కువైట్‌లోని బుబియాన్ ద్వీపంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పౌర వాహనాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (GCC) ప్రధాన కార్యదర్శి జాసెం మొహమ్మద్ అల్-బుదైవి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దాడులను కువైట్ సార్వభౌమాధికారంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసినవని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, ఈ దాడులు కువైట్‌లోని పౌరులు, స్థానిక నివాసితుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ సూత్రాలకు...