నిస్సహాయుడికి చేయూత... మానవత్వాన్ని చాటిన ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ
ఆదిలాబాద్ , ప్రతినిధి : మతాలకు అతీతంగా మానవ సేవే మహోన్నతమైనదనే సందేశాన్ని ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆచరణలో చూపించారు. సమాజ సేవలో భాగంగా సోషల్ వర్కర్ ముబారక్ ఆధ్వర్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే, రాజు అనే వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా లేక, ఆధారం లేకుండా మురికిగా, దయనీయ స్థితిలో జీవిస్తున్నాడు. అతని వద్దకు వెళ్లడానికి కూడా చాలామంది వెనుకంజ వేస్తున్న పరిస్థితిని గమనించిన ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ముందుకు వచ్చారు. వారు రాజుకు తల గుండు చేయించి, స్నానం చేయించి, పూర్తిగా శుభ్రం చేసి, కొత్త...