కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుబాయ్‌లో ఘనంగా రక్తదాన శిబిరం
దుబాయ్, జూలై 24, 2026: ప్రజా సేవకు ప్రతీకగా నిలిచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, LSPMK గ్రూప్ ఛైర్మన్ శ్రీ సత్యం రాధారపు మరియు స్పెక్ట్రమ్ గ్రూప్ వ్యవస్థాపకులు సీఏ బాలరాం రెడ్డి ఆధ్వర్యంలో, LSPMK గ్రూప్ మరియు స్పెక్ట్రమ్ ఆడిటింగ్ సంయుక్తంగా దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సహకారంతో దుబాయ్ బ్లడ్ డొనేషన్ సెంటర్, అల్ జద్దాఫ్ లో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. "గిఫ్ట్ ఆఫ్ లైఫ్" అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఏఈలోని తెలుగు ప్రజలు, భారతీయులు మరియు ఇతర దేశాలకు చెందిన వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఒక...