PM Jan Dhan Yojana 2026: ₹50 వేల నుంచి ₹2 లక్షల వరకు ఆర్థిక సహాయం అంటూ వైరల్ అవుతున్న సందేశంలో నిజమెంత?

Alert News : ఇటివల సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్‌సైట్లలో "ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన (PMJDY) 2026 దరఖాస్తు ఫారం విడుదలైంది. 13–65 ఏళ్ల వారికి ₹50,000 నుంచి ₹2,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది" అనే సందేశం విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ సమాచారం చూసి చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వైరల్ సందేశంలో ఉన్న వాదన - PMJDY 2026 దరఖాస్తు ప్రారంభమైందని పేర్కొంటోంది. - 13–25 ఏళ్ల వారికి ₹50,000 నుంచి ₹90,000 వరకు అందుతుందని చెబుతోంది. - 25–65 ఏళ్ల వారికి ₹90,000 నుంచి ₹2,00,000 వరకు ఇస్తారని పేర్కొంటోంది. - ఇప్పటికే చెల్లింపులు...