దుబాయ్‌లో స్థిరపడిన నగరి ప్రవాసాంధ్రులకు APNRT కీలక బాధ్యతలు
నగరి, ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల కోసం ఇటీవల ప్రకటించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంట్రీ కోఆర్డినేటర్ల జాబితాలో నగరి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ప్రవాసాంధ్రులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా కోఆర్డినేటర్లను నియమించిన APNRT కార్యక్రమంలో వీరికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషంగా నిలిచింది. నగరి ప్రాంతానికి చెందిన కాసాల లోకేష్, బొజ్జాల గిరి, బొజ్జాల గోపి గత పదేళ్లుగా దుబాయ్‌లో స్థిరపడి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. ప్రవాస తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో APNRTతో సమన్వయం చేయడం,...