TAB ఆధ్వర్యంలో శ్రీ వారి కళ్యాణం 2026 అజ్మాన్, యుఏఈ

ఇంటర్నేషనల్ న్యూస్ : తెలుగు అంబిషియస్ బాయ్స్ (TAB) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం 2026ను అజ్మాన్‌లోని జైనం జీవిక ఫార్మ్, హెలియో-2 వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇదే సందర్భంగా TAB తొలి వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. గత ఏడాది TAB యుఏఈలో తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ క్రీడలు, కమ్యూనిటీ సమావేశాలు, ఉద్యోగ రిఫరెన్స్ కార్యక్రమాలు, వ్యాపార సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. TAB వ్యవస్థాపకులు: నాగేంద్ర, ఆకాశ్, సుబ్బారావు, పవన్, వెంకట రమణ, హరి కృష్ణ. నిర్వాహక కమిటీ: అరీఫ్, ఉదయ్, తేజ, చైతన్య, మణిదీప్ (IT), మణిదీప్ (Solvix), బాలా, వెంకటేష్. కార్యక్రమ నిర్వహణలో వీరు...