నకిలీ ఆధార్, నివాస ధృవీకరణ పత్రాల కేసులో ఒకరు అరెస్ట్ – సీఐ ఇచ్చోడ రమేష్
నకిలీ ఆధార్, నివాస ధృవీకరణ పత్రాల కేసులో ఒకరు అరెస్ట్ – సీఐ ఇచ్చోడ రమేష్ ఆదిలాబాద్ జిల్లా: సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో నర్వాడే నాగ్‌సేన్ @ నక్సన్ (30 సం., జమిడి గ్రామం, ఇచ్చోడ)ను అదుపులోకి తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ రమేష్ తెలిపారు. నిందితుడు తాను పనిచేసే ఆధార్ సెంటర్‌లో మహారాష్ట్రకు చెందిన థాడ్ రోహిత్ బాపుకు డబ్బులు తీసుకుని సిరికొండ మండల పొన్న గ్రామానికి చెందిన వాడుగా నకిలీ పత్రాలు ఇప్పించాడని తెలిపారు. ఈ పత్రాల ఆధారంగా రోహిత్ అస్సాం రైఫిల్స్ కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో విచారణలో నకిలీ...