ఇచ్చోడ మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ
ఇచ్చోడ, జనవరి 1, 2026: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం – నవనిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజంగుల రాజు హాజరై జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గాజంగుల రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న లేబర్ బెనిఫిట్స్‌ను కార్మికులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు, హక్కులు, వాటి అమలు విధానాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఇచ్చోడ AITUC మండల ప్రధాన కార్యదర్శి కళ్లపెళ్లి గంగయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికుల ఐక్యతే...