రియాద్‌లో మోసపోయిన నల్గొండ వాసికి అండగా నిలిచిన ‘సాటా’
హైదరాబాద్/రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో మోసపోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తికి ‘సాటా’ (SATA) రియాద్ విభాగం అండగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న సాటా రియాద్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ పిలుపు మేరకు, తక్షణ అవసరాల నిమిత్తం అక్బర్‌కు కొంత ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు నల్గొండ జిల్లా వాసులు కూడా స్పందించి నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. అక్బర్ నివసిస్తున్న ప్రాంతంలో అందుబాటులో ఉన్న సాటా కోర్ టీమ్ సభ్యులు ముదిగొండ శంకర్ ఆధ్వర్యంలో మహ్మద్ నూరుద్దీన్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, దూడం సంజీవ్, మహమ్మద్...