ఆదిలాబాద్ లో ఏటీఎం దొంగ అరెస్ట్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  ఏటీఎం దొంగతనం కేసులో ఒడిషా కు చెందిన నిందితుడు బిప్లాబ్ కుమార్ జెనా (33) ను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు...  01.09.2025న నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని ఖార్గ్‌పూర్ నుండి నాగ్‌పూర్‌కు రైలు ఎక్కాడనీ  , 03.09.2025న తెల్లవారుజామున, అతను బస్సులో ఆదిలాబాద్ చేరుకున్నట్లు, నిందితుడు మొహమ్మదియా లాడ్జ్‌లో రూ. 100/-కి బెడ్ బుక్ చేసుకుని 4 రోజులు ఉన్నట్లు తెలిపారు. 08.09.2025న మధ్యాహ్నం వేళల్లో అతను ATMని ఉపయోగించాడనీ మరియు సాయంత్రం వేళల్లో (రీసీ) ATM పరిసరాలను పరిశీలించాడనీ ఆ తర్వాత  రైల్వే స్టేషన్...