ఆదిలాబాద్‌లో భారీ బ్లాక్‌మెయిలింగ్ దందా గుట్టురట్టు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ జిల్లా, జులై 12 : తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్లే జాతీయ రహదారి 44లో అక్రమ పశువుల రవాణా వాహనాలను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్ ముఠాను జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు మహారాష్ట్ర యావత్‌మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ నాయకత్వం వహిస్తుండగా, ఆదిలాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ రోహిత్ షిండే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు. రోహిత్ సింధే మహారాష్ట్ర కానిస్టేబుల్ సందీప్ నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు చేయగా, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారు: చేతన్ సింగ్...