క్షుద్ర మాంత్రికుడు అరెస్ట్

* క్షుద్ర పూజల పేరుతో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన, బాధితుల ఫిర్యాదు, అరెస్ట్.ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. * ప్రజలు అభివృద్ధి చెందిన ఆధునిక సమాజంలో మంత్ర తంత్రాలను నమ్మవద్దు. - ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజల పేరుతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల క్షుద్ర పూజలతో సమస్య తీరుతుందని బాధితులకు నమ్మబలికిన నిందితుడు *అభినయ్ కుమార్*. నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లాకు చెందిన సక్రాని గ్రామానికి చెందిన...