ఇందిరమ్మ ఇండ్లు 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించొద్దు : మంత్రి

మే 5 నుంచి 28 జిల్లాలలోని ఒక్కో మండలంలో రెవెన్యూ సదస్సులు 20 వ తేదీలోపు సదస్సులు పూర్తయ్యేలా ప్రణాళిక ఇందిరమ్మ ఇండ్లు 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించొద్దు రెవెన్యు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అదిలాబాద్ జిల్లా,  శుక్రవారం : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్...