బేల, జైనత్, బోథ్, ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు వీడీసీలపై కేసులు నమోదు : ఎస్పీ
విడిసిల అక్రమ కార్యకలాపాలపై ఉక్కు పాదంతో అణచివేస్తాం. 1. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే.విడిసిలు అక్రమ వసూళ్లకు, దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడరాదు. 2. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలి. 3. ఇప్పటివరకు జిల్లాలో 5 విడిసిలపై కేసులు నమోదు. 4. విడిసి బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి ఆదిలాబాద్ : గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజల కు భారంగా ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా గ్రామ అభివృద్ధి పేరుతో వసూలను చేయడం చట్ట వ్యతిరేకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక...