కేసులో ఉన్న ఎడ్లను ఇతరులకు ఇచ్చిన గుడిహత్నూర్ నందు కామధేను గోశాల యజమాని, నిర్వాహకుని పై కేసు నమోదు... : ఏఎస్పీ
కేసు లో ఉన్న ఎడ్లను అనధికారికంగా, దుర్వినియోగం చేస్తే గోశాల యజమానులపై కఠిన చర్యలు - ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్* గోషాల యజమానులకు కోర్టు ఆధీనంలో, కేసులో ఉన్న ఎడ్లను జాగ్రత్తగా కాపాడాలి అని సూచన. రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ / గుడిహత్నూర్ : క్రైమ్ నెంబర్ 51 /25 చెందిన కేసులో 15 ఎడ్లను కామదేను గోశాలకు పంపగా, కామదేను గోశాల గోశాల యజమాని ఆర్యన్, నిర్వాహకుడు రాజు అందులోని 11 ఎడ్లను ఇతరులకు అనధికారికంగా, దుర్వినియోగం చేసి ఇవ్వడం జరిగిందని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. ఈ విషయంపై గుడియత్నూర్ పోలీస్ స్టేషన్ నందు సుమోటో గా...