చిన్నారులను క్రూరంగా నరికి చంపిన కన్న తల్లి
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను క్రూరంగా వేట కొడవలితో నరికి, చంపింది,అనంతరం తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన లో మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి, (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు రామ్రాజ్ అసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆశిష్ మృతి చెందాడు. అయితే.. హర్షిత్ రెడ్డి ఘటన...