Indiramma Houses scheme: ఈ ఉగాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు..!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని కొత్త ఒరవడితో పునరుద్ధరించింది సర్కార్. ప్రజాపాలనాలో పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ స్కీమును ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ప్రభుత్వం ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేసి బడ్జెట్ లో భారీ నిధులను కేటాయించింది. అందువల్ల ఈ స్కీము విషయంలో...