20 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం స్వాధీనం - ఉట్నూర్ ఎ ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్
*దాదాపు రూ 40 వేల విలువగల ప్రభుత్వ రాయితీ బియ్యం, తరలిస్తున్న వాహనం స్వాధీనం.* *4 గురి పై కేసు నమోదు.* *అక్రమ సరుకు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.* ఉట్నూర్: బుధవారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 20 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం లభ్యమైందని ఉట్నూరు ఎ ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. అక్రమంగా సరుకు రవాణా చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న దళారుల పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు...