MLC ELECTION: ఆదిలాబాద్ జిల్లా లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
ఆదిలాబాద్ జిల్లా : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య పాల్గొన్నారు. ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్ లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లించాలని, రెగ్యులర్ ఎమ్ఈఓ, డీఈఓ లను నియమించాలని, ట్రైబల్ స్కూల్స్ లో ఉపాద్యాయులకు, సిబ్బంది లకు వారంతపు సెలవు మంజూరు చేయించాలని, ఉద్యోగ విరమణ వయస్సు పెంచకుండ చూడాలని, జీఓ 50...