Agency Act 1/70 : ఏజెన్సీ ప్రాంతంలో సంక్షేమ పథకాలకు గిరిజనేతరులను లబ్దిదారులగా ఎంపిక చేయడం చట్ట విరుద్దం : ఆదివాసి సేన
*ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి* ఆదిలాబాద్//తేది:27-01-2025:- ఏజెన్సీ ప్రాంతంలో– ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, మరియు రైతు భరోసా వంటి నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపికలో పేసా గ్రామసభలకు ముఖ్యంగా PESA Act- 1996 చట్టం మరియు నిబందనలు, LTR చట్టం, నిబంధనలు పాటించకుండా, గత నాలుగు రోజులుగా జనవరి 21 నుండి 24 వరకు ప్రజాపాలన పేరిట జరిగిన సాదారణ గ్రామసభలలో చదివి వినిపించిన, ప్రచురించిన అర్హుల జాబితాలలో భూబదాలయింపు నిరోధక చట్టం ఎల్.టి.ఆర్-1/59, 1/70, 1359 ఫస్లి చట్టాలకు విరుద్ధంగా ఉన్నటువంటి గిరిజనేతరుల పేర్లు కూడా జాభితాలో చేర్చారు. ఇది...