బీజేపీ కి బిగ్ షాక్... కాంగ్రెస్ లో చేరిన మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు
ఆదిలాబాద్ : జిల్లా ఇచ్చోడ మండలంలో బిజెపికి బిగ్ షార్ తగిలింది. బీజేపీ పార్టీ ఇచ్చోడ మండల మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ( రెండు సార్లు) , సొసైటీ బ్యాంక్ పిఏసిఎస్ వైస్ చైర్మన్, జామిడి విడిసి చైర్మన్ హరన్ మారుతి పటేల్ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం నాయకులు ఆడే గజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరన్ మారుతి పటేల్ మాట్లాడుతూ కొత్తవారు బీజేపీ లో వచ్చి పాత కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం సర్వేల పేరిట ప్రజలను మోసం చేసిందని కానీ కాంగ్రెస్...