మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు?
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరిం చారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్ రావును అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్టే షన్ కు తరలించారు. *దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి...