ఆరోగ్య పాఠశాల మనందరి బాధ్యత
ఆదిలాబాద్ : జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు అంతే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడం కోసం రూపొందించిన కార్యక్రమమే ఆరోగ్య పాఠశాల అని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆన్నారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రి లోని ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నవంబర్ 14 వ తేదీ నుండి అన్ని ఉన్నత పాఠశాలల్లో, KGBV, ఇంటర్ కళాశాలల్లో ప్రారంభం కావడం జరుగుతుందనీ, ఒక్కో వారం...