కుంరం భీం స్పూర్తితో ఆదివాసీ అస్తిత్వ మనుగడ రక్షణకై మారో పోరాటానికి సిద్ధం కండి
• ఆదివాసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : ఈ రోజు అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గోండ్వనా రాయి సెంటర్ సార్మెడి పేందోర్ జైరాం ఆధ్వర్యంలో మండలంలోని మన్కపూర్ రాయి సెంటర్ నుంచి కాలినడకన గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని కుంరం భీం విగ్రహం వద్ద చేరుకోని ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజాలు నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించి ఘనంగా 84వ కుంరం భీం వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో...