ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
*ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం) సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల వివరాల విడుదల.* *ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.* *ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ పిలుపు.* ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) ను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు కార్యాలయాలలో మరియు ప్రజల సమక్షంలో అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల కు సంబంధించి...