పెసా చట్టం పంచాయితీల ( షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు) 1996 యొక్క నిబంధనల ప్రకారం పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగింది.

జిల్లా పాలనాధికారి రాజర్షి షా. అదిలాబాద్ జిల్లా :  PESA చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ అయినా చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి స్థానిక గ్రామ సభ తీర్మానం తప్పనిసరి . ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరు సభ్యులే.  గ్రామసభ నిర్వహణకు కావలసిన కోరం 1/3.  అందులో  కనీసం 50 శాతం గిరిజనుల హాజరు తప్పనిసరి.  అట్టి తీర్మానాల నిర్ణయాలను నాలుగు వారాల లోపు సంబంధిత శాఖకు సమర్పించాలి. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి తహసీల్దార్లు, ఎంపీడీవో, mpo, SDC,...