ఎస్సీ , ఎస్టి కేసు లో నలుగురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ 4000/- జరిమానా విధించిన ప్రత్యేక న్యాయమూర్తి

రిపబ్లిక్ హిందుస్థాన్ , రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో, 16-05-2020 రోజున తమ బంధువును తీసుకెళ్లాడని కోపంతో ఎస్సీ మాల కులానికి చెందిన బాట్ల అన్వేష్ (17 సంవత్సరాలు) అనే యువకుడిని, నేరస్తులైన గారి పెళ్లి హరీష్ కుమార్ గౌడ్, ముత్యం సాయి, పట్కూట్ ప్రశాంత్, మహమ్మద్ అజ్మత్ ఖాన్ అనే నలుగురు చేతులు, బెల్టు, కర్రలతో కొట్టి గాయపరిచి కులం పేరుతో దూషించి చంపుతానని బెదిరించి మూత్రం తాగించి హింసించారు. ఈ ఘటనపై బాధితుడు దరఖాస్తు మేరకు అప్పటి జన్నారం ఎస్సై ఎం. వినోద్ కుమార్ కేసు నమోదు చేయగా, జి. నరేందర్ ఏసిపి జైపూర్,...