కుల వృత్తులు, చేతి వృత్తులు వారికి వరం - స్వయం ఉపాధికి భరోసా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం
ఉట్నూర్ / ఆదిలాబాద్ : సెప్టెంబర్ 2 నుండి 10 వరకు జరిగిన మొదటి విడత శిక్షణలో 21 మంది వృత్తి కళాకారులు సర్టిఫికెట్స్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్ పాల్గొన్నారు. PM విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకలు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు గోడెం నగేశ్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు (ఖానాపూర్), పాయల్ శంకర్ (అదిలాబాద్), జిల్లా పాలనాధికారి రాజర్షి షా, విద్యానంద్ జాయింట్ డైరెక్టర్ RDSD హైదరాబాద్, సీతారాములు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్,...