టీ హబ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ఓ, రిమ్స్ డైరెక్టర్

రిపబ్లిక్ హిందుస్థాన్ ,  ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆవరణలో గల టి హబ్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిపోర్ట్ లు ఎలా ఇస్తున్నారు. రిపోర్టులలో కొన్ని తప్పులు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని  మేనేజర్ హరీష్ ను అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి ఒక్కొక్క పరికరంలో ఎన్ని ఘట్ట పరీక్షలు చేస్తారని ఎంత టైం లో రిపోర్ట్ లు వస్తాయని అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులు ఎవరు కలెక్ట్ చేస్తారని...