Weather : నీట మునిగిన విజయవాడ

విజయవాడలో heavy rain in vijayawada నిన్న శనివారం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర వాసులు ఒక్కసారి భయ బ్రాంతులకు గురయ్యారు. చాలా ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షానికి పలు కాలనీ లన్నీ పూర్తిగా జలమయమ య్యాయి. సెల్లర్లలోకి వరద నీరు వచ్చింది. చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు నీట మునిగిన పరిస్థితి నెలకొంది. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్దకొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడ వాయుగుండంగా మారి...