ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా పంచాయతి, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. రేపటి నుండి మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే, వారు ప్లాట్...