పాత ఫోన్లు ప్లాస్టిక్ వస్తువుల కోసం అమ్మాలనుకుంటున్నారా...? అయితే ఈ వార్తను ఒకసారి చదవండి...

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.తేది 21.08.2024 న గోదావరిఖని మేడిపల్లి NTPC ఏరియాలో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు రామగుండం సీసీపీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న సీసీపీఎస్ ఎస్ హెచ్...