సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతే వెంటనే 1930 కు సంప్రదించాలి
సైబర్ నేరాల అడ్డుకట్టకు ప్రజలలో అవగాహన కీలకం - జిల్లా ఎస్పీ . మోసపోయిన వెంటనే తెలుసుకొని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను సంప్రదించాలి. బాధితునికి న్యాయం చేసి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం. వివరాలలో.... జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ల లో, బస్టాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరులైన ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ను సంప్రదించి సరైన సమయంలో న్యాయం జరిగి, పోయిన డబ్బును తిరిగి బాధితునికి...