తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో అధికారుల సోదాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలోఈరోజు ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతిగృహాల్లో మంగళ వారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విషయాలపై ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీద దాడులు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ...