సర్వే చేయరు… సమస్య పరిష్కారం కాదు… హద్దులు చూపెట్టక పోవడంతో రైతు మనోవేదన
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరిట రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అయితే భూప్రక్షాళన చేపట్టి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉదాహరణకు జామిడీ గ్రామంలోని హరన్ మారుతి అనే రైతుకు జామిడి శివారంలో ని 25 సర్వే నెంబర్ భూమి ఉంది. తన భూమిని కొలిచి ఇవ్వాలని చెప్పేసి గత కొన్నేళ్లుగా మీ సేవ ద్వారా ఎంసీ ఫీజు కడుతున్నారు. ఎంసి ఫీజు కట్టిన ప్రతిసారి ఈరోజు రేపు అనుకుంటా రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకోవడమే తప్ప సమస్యను మాత్రం పరిష్కారం చేయడం...