చరిత్ర మరిచిన యోధుడు రాంజీ గోండ్

వ్యాసకర్త : గాజుల రాకేష్ పటేల్ త్యాగాల నేల ఈ తెలంగాణ అందులో అడివితల్లి నే ఆసరాగా చేసుకుని దాయాదుల పై పోరు సలిపి నేలకొరిగిన ఆదివాసీ ముద్దుబిడ్డలు కొమురం భీం అయితే మరొకరు రాంజీ గోండ్. రాంజీ గోండ్ పాలకులు విస్మరించిన యోధుడు, చరిత్ర మరిచిన ఉద్యమనాయకుడు,  అటు బ్రిటిష్ సైన్యాన్ని, ఇటు నిజాం లను గడగడ లాడించి ముడుచేరువుల నీళ్ళు తాగించిన ఆదివాసీ నాయకుడు రాంజీ గోండ్. నిమ్మరాజులు పాలించిన నిర్మల్ పట్టణం గుట్టలు, చెరువులు, బురుజులు, కొయ్యబొమ్మలే కాదు.. సాహసో పేతమైన వీరుల త్యాగాలు చరిత్రకు సజీవసాక్ష్యం.  నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి పునాదులు వేసి, ఎందరో వీరుల్లో స్ఫూర్తి నింపి పోరాటంలో...