మెడికల్ పారామెడికల్ సిబ్బందితోపాటు ఆశా కార్యకర్తలకు వైద్య పరీక్షలు
-- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : త్వరలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మెడికల్ పారామెడికల్ సిబ్బందితోపాటు ఆశా కార్యకర్తలు అందరికీ విడుదలవారీగా వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు మన ఆరోగ్యం బాగుంటేనే మనం పది మందికి సేవ చేయగలమని తెలిపారు. దృష్టిలో ఉంచుకొని...