సౌదీలో  ఘనంగా ఉగాది వేడుకలు

రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా :దేశంలో ఏదొక పేరుతో సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తున్న రోజుల్లో ఎక్కడో బయట దేశానికి వెళ్లిన వారు తమ మాతృభూమికి దూరంగా ఎడారి దేశాలలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు వీలయినప్పుడల్లా విదేశీ గడ్డపై తమ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తెలుగు పండుగలను అందరు కలిసి వైభవంగా జరుపుకుంటారు. శ్రీ శుభకృత్  నామ సంవత్సర ఉగాది వేడుకలను సౌదీ అరేబియాలో మదీన రాష్ట్రంలో యాన్బూ పారిశ్రామిక పట్టణంలో తెలుగు ప్రవాసీయులు అఖిల భారత తెలుగు సేన అధ్వర్యంలో ఇటీవల అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు...