ప్రధాని మోదీ ని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.ప్రధానితో పార్లమెంట్ పరిధిలోని పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించాలని కోరారూ. దీనికోసం ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించానని అన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్- 2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని మోడీ కోరానట్లు, అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని.. పెరిగిన రద్దీ గురించి, జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న...