ఆక్రమణకు గురైన మా పట్టా భూమిని మాకు ఇప్పించండి
ఆదివాసి సేన సంఘానికి అత్రం వంశ వారసుల విన్నపం రిపబ్లిక్ హిందుస్థాన్, జన్నారం (14 మార్చ్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతంలో గల సర్వే నంబర్ 122లో గల భూమి విస్తీర్ణం 631.33 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి లాక్కున్నారని అట్టి భూమిని మాకు ఇప్పించాలని ఆ భూమికి సంబంధించిన పట్టాదారు వారసులు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి కి విన్నవించారు.ఈ సందర్భంగా ఆదివాసి సేన జన్నారం మండల అధ్యక్షులు దుర్వ యశ్వంత్, ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోట్నక గణపతి అధ్వర్యంలో రాత పూర్వకంగా...