రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

- గిర్నూర్ గ్రామ అధ్యక్షుడు రాజు యాదవ్ రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ :రాష్ట్రంలో రానుంది బీజేపీ సర్కరేనని గిర్నూర్ గ్రామ అధ్యక్షులు రేండ్ల రాజు యాదవ్ అన్నారు. బుధవారం బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో ప్రజా గోస బీజేపీ బరోస కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా కార్యదర్శి ఆడే మానాజి మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, పంచాయతీలకు బీజేపీ సర్కార్ నిధులు ఇస్తుందని కానీ వాటికి గులాబీ రంగేసి రాష్ట్రం సోకులు చేస్తుందని మాధవ రావు...