'రియల్ ' భూ మాఫియా చేతిలో కీలు బొమ్మల తయారైన అధికార వ్యవస్థ

చర్యలు చేపట్టినట్లు పెట్టిన హెచ్చరిక ఫ్లెక్సీలు తొలగించి యధావిధిగా కొనసాగుతున్న  అక్రమ వెంచర్ అభివృద్ధి పనులు....డిటిసిపి అనుమతి లేకుండా అక్రమ వెంచర్ల నిర్వహణతో  గ్రామపంచాయతీ కి రావాల్సిన 10 % భూమిని కోల్పోతున్న వైనం....కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి.... అధికారులు మా జేబులో ఉన్నారు... ఎవరికి బయపడకండి.... ప్లాట్లు కొనండి అని  కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్న రియల్ మాఫియా..... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అధికార వ్యవస్థ ను చులకన చేసి రియల్ మాఫియా మండలం లో రెచ్చిపోతోంది. ప్లాట్లు కొనే వారికి ఎవరు ఏమి చేయలేరు... దర్జాగా ప్లాట్లు కొనండి అని కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్నారు సదరు రియల్టర్లు...