తెలంగాణ ప్రభుత్వముతోనే గ్రామాల అభివృద్ధి : బోథ్ ఎమ్మెల్యే
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని జామిడి గ్రామాన్ని సందర్శించి సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళ వారం రోజున బోథ్ శాసనసభ్యులు రాథోడ్* బాపురావు భూమి పూజ చేశారు. ఈ సంధర్బంగా గ్రామస్థులు పూలతో ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వముతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, మునుపెన్నడు లేని విధంగా అద్భుత సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామంలో ఇండ్లు లేని వారికి మొదటి విడతగా ఇండ్లు మంజూరు చేశారు. అదే విధంగా దళితబంధు కూడా ప్రతి అర్హులైన వారికి దక్కేలా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. పథకాల పై కొందరు చేస్తున్న అసత్య...