బడ్జెట్లో విద్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి
◾️ నూతన జాతీయ విద్యా విధానం- 2020 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షు కే. జంగయ్య రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట :ఆదివారం నేరేడుచర్లలోని ఏ-1 ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట జిల్లా టిఎస్ యుటిఎఫ్ నాలుగో మహాసభలు నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండలాల సౌజన్యంతో జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మహాసభల ను ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెంచాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని...