తాగి విద్యార్థినినీ కొట్టిన ఉపాధ్యాయుడు…!?

▪️ఆలస్యంగా రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన సంఘటన.... ▪️విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు తాగుడుకు బానిసై విద్యార్థులను చితక్కొడుతున్నాడని తల్లిదండ్రుల ఆరోపణలు.... ▪️ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.... రిపబ్లిక్ హిందుస్థాన్, మహబూబాబాద్ జిల్లా : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. కొన్ని సంఘటనల్లో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు సభ్య సమాజం తలదించుకోలేలా చేస్తున్నాయి.  తాజాగా మహబూబాబాద్ జిల్లా  ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బానోత్ ప్రవళికను  ఉపాధ్యాయుడు సూర్య మెడపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న వార్డెన్ అమ్మాయికి ఆయిట్...